రుణగ్రస్తుడికి కోపం వచ్చింది

- బ్లాక్ లిస్టులో చేర్చారని.. ముత్తూట్ ఫైనాన్స్‌కు కన్నం పెట్టే యత్నం
- లాకర్ ఓపెన్ చేసే క్రమంలో మోగిన అలారం..
- అక్కడి నుంచి నిందితుడు పరార్..
- సీసీ ఫుటేజీల ఆధారంగా అరెస్ట్
బ్లాక్ లిస్టులో చేర్చారనే కోపంతో ఓ రుణగ్రస్తుడికి కోపం వచ్చింది. అంతే.. ఏకంగా ఆ ఫైనాన్స్ సంస్థను కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు. సింగిల్‌గా రంగంలోకి దిగి.. చోరీకి యత్నించి.. అలారం మోగడంతో పారిపోయాడు. బుధవారం అర్ధరాత్రి దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీకి విఫలయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు చెప్పిన మాటలతో పోలీసులు అవాక్కయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ ప్రాంతానికి చెందిన ఓ సెంట్రింగ్ మేస్త్రీ చాలా కాలంగా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం గిరివి పెట్టి రుణం తీసుకునేవాడు. తిరిగి డబ్బులు చెల్లించి గిరివి విడిపించుకునేవాడు. ఇలా ఓ సారి బంగారం గిరివిపెట్టి వడ్డీ సరిగా కట్టక పోవడంతో సంస్థ అతడి పేరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అయితే ఇటీవల నిందితుడు రుణం కావాలని ముత్తూట్ ఫైనాన్స్‌కు వెళ్లగా రుణం ఇవ్వలేదు. ఇదేమిటని ఆరా తీయగా గతంలో మీరు సరిగ్గా వడ్డీ కట్టకపోవడంతో మీ పేరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని తెలిపారు. రుణం ఇవ్వడం కుదరని తేల్చి చెప్పారు. గతంలో రుణం తీసుకున్న ప్రతీసారి సరిగానే కట్టానని.. ఒకసారి మాత్రం కట్టలేక పోయానని.. ఆ మాత్రానికే బ్లాక్ లిస్ట్‌లో పెడుతారా అంటూ సంస్థ సిబ్బందితో వాదించాడు. అయినప్పటికీ రుణం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సంస్థపై కోపం పెంచుకున్న నిందితుడు.. ఎలాగైనా సంస్థను కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నారు. గతంలో అనేక మార్లు ఫైనాన్స్ సంస్థకు వెళ్లిన నిందితుడికి సంస్థ పరిసరాలపై పూర్తి అవగాహన ఉన్నది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిందితుడు నిత్యం పనికి ఉపయోగించే ఓ పెద్ద సుత్తెను తీసుకుని వెళ్లి సంస్థ వెనక వైపు గోడకు రంధ్రం చేశాడు. అందులోనుంచి కార్యాలయం లోపలికి వెళ్లి.. పది నిమిషాల పాటు అందులోనే గడిపాడు. తర్వాత లాకర్ తీసే క్రమంలో అలారం మోగడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం నిందితుడిని (సెంట్రింగ్ మేస్త్రీ) పట్టుకున్నారు. అయితే అధికారికంగా ఇక మీడియా ముందుకు తీసుకురావాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Muthoot finance
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

