ముంబై: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరులోనే కాదు ఆర్జనలోనూ దూసుకెళుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఒక పోస్ట్‌కు 5 కోట్లు సంపాదిస్తున్నాడట. బ్రిటన్‌కు చెందిన హాపర్‌హెచ్‌క్యూ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న జాబితాను విడుదల చేసింది. పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఒక పోస్ట్‌కు ఏకంగా 11కోట్లు వసూలు చేస్తున్నాడు. టాప్-20 జాబితాలో భారత్ నుంచి కోహ్లీ ఒక్కడే చోటు దక్కించుకోగా, ప్రియాంక చోప్రా 27వ స్థానంలో ఉంది.