బంజారాహిల్స్, డిసెంబర్ 13: బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు జన్మదిన వేడుకలు మంగళవారం బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద ఘనంగా జరుపుకున్నారు.
పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎంపీ కేశవరావు కేక్ కట్ చేశారు. అనంతరం ఎన్బీటీనగర్లో మొక్కలు నాటారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.