Mother molest | నవమాసాలు మోసి కనిపెంచిన కన్న తల్లిపైనే ఓ కుమారుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే.. ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ అబ్బాయి మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తన కోరికలు తీర్చుకునేందుకు కన్నతల్లిపైనే కన్నేశాడు. దీంతో ఆమెను భయపెట్టించి బలవంతంగా లైంగికదాడికి పాల్పడుతూ వస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు మళ్లీ తల్లిపై అత్యాచారం చేశాడు. చివరకు తన కుమారుడి వేధింపులు భరించలేక.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.