దుండిగల్, ఫిబ్రవరి 11 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్‌రాజును మరో పదవి వరించింది. ప్రభుత్వం శాసనమండలి ‘విప్’గా నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
శంభీపూర్లో సంబురాలు: ఎమ్మెల్సీ రాజును ప్రభుత్వ విప్‌గా నియమించినట్లు ఉత్తర్వులు వెలువడిన వెంటనే సోషల్‌మీడియాలో ఆయనకు అభినందనలు వెళ్లువెత్తాయి. మరో వైపు ఆయన సొంత ఊరు శంభీపూర్లో చిన్ననాటి స్నేహితులు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచి సంబురాలు జరుపుకొన్నారు. వేడుకల్లో ఎమ్మెల్సీ సోదరుడు, కౌన్సిలర్ శంభీపూర్కృష్ణతో పాటు స్నేహితులు యాదన్న, చంద్రశేఖర్, జీతయ్య, గోపాల్, తిరుమలేశ్, రమేశ్, యాదగిరి, భిక్షపతి, శ్రీశైలం, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.