తెలుగు యూనివర్సిటీ, జూలై 22: గోరటి వెంకన్న కవిత్వం, జీవితాన్ని కాచి వడపోసినట్టు ఉంటుందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆ చార్య టి.కిషన్‌రావు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ జి.చెన్నకేశవరెడ్డి సాహి త్య పురస్కారాన్ని ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ప్రదానం చేశారు. పురస్కారం కింద ఐదువేల నగదు, శాలువాతో వెంకన్నను ఘనంగా సత్కరించారు. కార్యక్ర మానికి అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, పల్లె ప్రజల సంస్కృతి, జీవనం, కష్ట నష్టాలు వెంకన్న గేయ కవిత్వంలో యథాతథంగా నిండి ఉంటాయని కిషన్‌రావు పేర్కొన్నారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సామాజిక అంశాలతో పాటు భక్తి రచనలు కూడా చేసే ప్రత్యేక కవిగా వెంకన్నను అభివర్ణించారు. పరిష త్తు ప్రధాన కార్యదర్శి డా॥ జె.చెన్నయ్య మాట్లాడుతూ ప్రపంచీకరణకు మొట్టమొదట స్పందించిన కవులలో వెంకన్న ప్రధానులన్నారు. ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అనే దీర్ఘ గేయం అందుకు నిదర్శనం అన్నారు. పురస్కార గ్రహీత గోరటి వెంకన్న స్పందిస్తూ పరిషత్తులో చదువుకోవడం వల్లే తనకు ఈ గౌరవం ప్రత్యేకమైందన్నారు. తెలంగాణ వైభవాన్ని చాటే ‘పూసిన పున్నమి’ అనే పాటలోని అంశాలను వివరించి ఆహుతుల ప్ర శంసలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎం.రామారావు సాహతీవేత్తలు పాల్గొన్నారు