Janwada school | జనవాడ స్కూల్.. దేశానికే రోల్ మోడల్.. ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆకాంక్ష
ఈ సందర్భంగా ఆమె గ్రామస్తుల తరఫున కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆక్షాంక్షించారు. అలాగే, జనవాడ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృజత్ఞతలు తెలిపారు.
- కేటీఆర్ చొరవతో నిర్మించిన నూతన పాఠశాల భవనం ప్రారంభం
దేశంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు జనవాడ స్కూల్ రోల్ మోడల్ కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జనవాడ గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో సీఎస్ఆర్ నిధులు రూ. 5 కోట్లతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి గ్రామానికి, రాష్ర్టానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. జనవాడ పాఠశాల భవనం కూలిపోయే స్థితిలో ఉన్నదని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన ప్రత్యేక చొరవ తీసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.
– శంకర్పల్లి రూరల్, ఆగస్టు 20
ఈ సందర్భంగా ఆమె గ్రామస్తుల తరఫున కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆక్షాంక్షించారు. అలాగే, జనవాడ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృజత్ఞతలు తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన గౌడిచర్ల వెంకటేశ్‌ను అభినందించారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్ ఉంటుందని.. ప్రతి విద్యార్థి పరిస్థితులకు అనుగుణంగా చదివి రాణించాలన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు గోవర్ధన్‌రెడ్డి, నర్సింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజూనాయక్, మాణిక్‌రెడ్డి, సర్పంచ్‌లు రాఘవేందర్‌రెడ్డి, మల్లికార్జున్, కౌన్సిలర్ కృష్ణ, ఆనంద్, నాయకులు వెంకటేశ్, వెంకట్‌రెడ్డి, చంద్రమౌళి, వాసుదేవ్‌కన్నా, రవీందర్‌గౌడ్, మైసయ్య, శ్రీనివాస్, నాగేందర్, శ్రీకాంత్‌రెడ్డి, అశోక్‌గౌడ్, అశోక్, శివరాజ్, ఎంఈవో రవీందర్రావు, ప్రధానోపాధ్యాయుడు దైవదీనం రెడ్డి, ఇండస్ డైరెక్టర్ నవీన్ నీకోలస్, ఇండస్ ప్రిన్సిపాల్ పరిధా, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

