బండ్లగూడ : పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వ దవాఖానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. శివరాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బస్తీలలోని ప్రజలు తమ బస్తీలలోనే వైద్య సేవలు పొందుతున్నారన్నారు.
ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి వ్యాక్సిన్లు వేసుకునే పరిస్థితి లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో ఉచితంగా వ్యాక్సిన్లను వేస్తున్నట్లు వివరించారు. 12 సంవత్సరాలు నిండిన పిల్లలందరికి వ్యాక్సిన్లను వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వందన,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సిరాజుద్దీన్,శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.