మణికొండ, సెప్టెంబర్ 15 : ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు నిధులు మంజూరుచేసినా సకాలంలో పనులను చేపట్టకపోవడం సరికాదంటూ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆర్అండ్బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కోకాపేట-గండిపేట వరకు కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులను ఆయన అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కోకాపేట విజేత, రాజపుష్పా ముందు కొనసాగుతున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత రెండేళ్ల కిందటే ప్రభుత్వం రోడ్డు విస్తరణ కోసం అవసరమైన నిధులను మంజూరుచేసినా పనుల్లో ఆలస్యం జరగడానికి గల కారణాలేమిటనీ ప్రశ్నించారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండటంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. బ్రిడ్జి పనులను పూర్తిచేసి వీలైనంత తొందరగా రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అప్పటి వరకు రాకపోకల విషయంలో స్థానిక మున్సిపాలిటీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేప్టటాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, కమిషనర్ సత్యబాబు, డీఈ నర్సింహరాజు, కౌన్సిలర్లు ఆదిత్యారెడ్డి, అరుణజ్యోతి, పత్తి శ్రీకాంత్, శివారెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు నర్సింహ, హరిశంకర్, రాము, తదితరులు పాల్గొన్నారు.