శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 9 : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనని తెలిపారు. ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, ఎంపీడీవో వినయ్‌కుమార్, ఎంఈవో రాంరెడ్డి, ఉపాధ్యాయులు బాల్‌రెడ్డి, వెంకటరమణగౌడ్, మల్లేశ్‌గౌడ్, రాములు, ఇమానియల్ పాల్గొన్నారు.
మణికొండ, సెప్టెంబర్ 9 : నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రేహౌండ్స్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చొరవచూపాలని గురువారం ఎస్పీ రమేశ్, డీఎస్పీ రాములు, శంకరయ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కలిసి విన్నవించారు. కొన్నిరోజులుగా మంచిరేవుల గ్రామ పరిధిలోని గ్రేహౌండ్స్‌లోని సిబ్బంది నివాస గృహాల వద్ద సీసీరోడ్లు, తాగునీటి వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి పైపులైన్లు, సిబ్బంది నివాసముంటున్న సముదాయాల వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. దేవాలయ కమిటీ చైర్మన్ పొన్న రమేశ్, కౌన్సిలర్ నరేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి,సెప్టెంబర్9: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ డివిజన్లలోని అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 177.85 లక్షల నిధులతో పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్‌కు సూచించారు. గురువారం మైలార్‌దేవ్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ ,రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ జగన్, ఈఈ నాగేందర్‌గౌడ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు.