మైలార్‌దేవ్‌పల్లి, సెప్టెంబర్ 6: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సూచించారు. సోమవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలీపురం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉన్నదో ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందని ,గదులు తక్కువగా ఉన్నాయని మరో 5 గదులు పాఠశాలకు కావాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను కోరారు. టీచర్ల సంఖ్య పెంచాలని కోరారు. గ్రౌండ్లో ప్రహరీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడు తూ..పాఠశాల అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని తెలిపారు. తరగతి గదులు, టీచర్ల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులు శానిటైజేషన్ చేసే విధంగా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రాంరెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌దాస్‌గౌడ్ ,ప్రేమ్‌గౌడ్ ,వెంకటేశ్,కాశీగారి యాదగిరి,ఎల్లప్ప,యంజాల మహేశ్‌రాజ్ ,యంజాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.