శంషాబాద్ రూరల్, ఆగస్టు 23 : మండలంలోని పాలమాకుల టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్‌గౌడ్‌ను రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో సోమవారం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కీలకమన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసినప్పుడే ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్‌రావు, నాయకులు గూడల కృష్ణయ్యగౌడ్, రవీందర్‌నాయక్, శ్రావణ్‌కుమార్‌గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, రాజు, జాంగీర్, శివకుమార్, హుమ్లానాయక్, శ్రీధర్‌గౌడ్, గోపాల్, మురళి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పోచన్నగారి రాజు, ఉపాధ్యక్షుడిగా శ్రావణ్‌గౌడ్, కమిటీ సభ్యులుగా మధుసూదన్‌రెడ్డి, బోద్దం రాజు, శ్రీనివాస్‌గౌడ్,ఆంజనేయులు, శ్రీశైలం, గూడెపు యాదయ్య, రంజిత్, మల్లేశ్, శివ, గణేశ్, శంకర్, శ్రీనులను ఎన్నుకున్నారు.