కవాడిగూడ, ఆగస్టు 27: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భోలక్‌పూర్ డివిజన్లోని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కేఎం శంకర్ ఆధ్వర్యంలో గంగపుత్ర కార్యాలయం ఎదుట ఎమ్మె ల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. నేటి వరకు ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్‌పూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, భోలక్‌పూర్ ఇన్చార్జి బింగి నవీన్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరి ఎ. శంకర్ గౌడ్, ఆర్. శ్రీనివాస్, నాయకులు మున్వర్ చాంద్, ఆనంద్ రాజ్, కేఎం సాయి కిరణ్, గంగపుత్ర సంఘం ప్రతినిధులు కొండల్, శ్రీకాంత్, నితిన్, చిట్టిబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప, పద్మజ, ఉషాకిరణ్, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.