మల్కాజిగిరి, ఏప్రిల్1 : హిందూ శ్మశాన వాటికను పరిరక్షిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం బోయిన్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో మచ్చబొల్లారం హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ నాయకులు ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డిని కలిసి శ్మశాన వాటికను కబ్జా నుంచి రక్షించేందుకు చేస్తున్న పోరాటానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్మశాన వాటికను ఆక్రమించి డంపింగ్ యార్డుగా మార్చడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మచ్చబొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను పరిరక్షించడానికి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశానని అన్నారు. చట్టబద్ధంగా శ్మశాన వాటికను అప్పగించేంతవరకు పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు వెంకన్న, రమేష్, అనిల్ కిశోర్ పాల్గొన్నారు.