బంజారాహిల్స్,ఆగస్టు 23: ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన మహ్మదీ బేగం అనే మహిళకు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరరైన రూ.30వేల చెక్కును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, మహ్మద్ అజీముద్దీన్, జహంగీర్, రహీం తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుమ్మరి సంఘం భవన నిర్మాణానికి 200 గజాల స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ ప్రజాపతి, ప్రధాన కార్యదర్శి పావనితో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సో మవారం వినతిపత్రం అందజేశారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడంతో పాటు ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఉదయ్‌కిరణ్, నరేశ్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.