వెంగళరావునగర్, ఆగస్టు 13: పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ డివిజన్, శ్రీనగర్ కాలనీలోని నాగార్జుననగర్ కమ్యూనిటీహాల్లో పారిశుధ్య కార్మికుల భద్రత కోసం 75 మంది కార్మికులకు రక్షణ కిట్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భాగ్యనగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజూ పారిశుధ్య కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని..వారి భద్రత కోసం కిట్లను అందజేస్తున్నామన్నారు. రోడ్లు పరిశుభ్రంగా ఉంచడం, నాలాల్లో పూడికలు తీయడం వంటి విధులు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ఈ కిట్లను కార్మికులంద రూ ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కార్మికుల భద్రత కోసం చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు, మాస్కులను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, ఏఎంహెచ్ఓ భార్గవ నారాయణ, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, తన్నూఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.