కాచిగూడ,ఆగస్టు 11: ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, భూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అంబర్‌పేట ఎమెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు. మంగళవారం కాచిగూడ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిధిగా ఎమెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టి మూడేండ్లు సమీస్తున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని,ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ప్రజలు ఛీ కొడుతున్నారని మండిపడ్డారు.
పేదల కోసం సంక్షేమ పథకాలను చేపట్టిన బీఆర్ఎస్ పార్టీని రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహాకారంతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పేద ప్రజల కోసం మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను నేరుగా పేద కుటుంబాలకు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, అశోక్, బబ్లూసింగ్, ఎల్.రమేశ్, శేషుపేరి, మహేశ్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.