MLA Jagadish Reddy : సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన గురువు డా. దొంగరి వెంకటరామ్కు నివాళులు అర్పించారు. వెంకటరామ్ అనారోగ్యంతో మృతి చెందారనే విషయం తెలియగానే మాజీ మంత్రివర్యులు ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. మహాప్రస్థానానికి వెళ్లి జగదీశ్ రెడ్డి గురువు మృతదేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సూర్యాపేట ఎస్వీ కళాశాల ఎకనామిక్స్ విశ్రాంత అధ్యాపకులు డా. దొంగరి వెంకటరామ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్లోని మియాపూర్లో కుటుంబంతో కలిసి ఉంటున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే వెంకటరామ్కు నివాళులు అర్పించేందుకు జగదీశ్ రెడ్డి వెళ్లారు.