MLA Arekapudi Gandhi | లింగంపల్లి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ
MLA Arekapudi Gandhi | లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) శుక్రవారం పరిశీలించారు.
శేరిలింగంపల్లి ( హైదరాబాద్ ) : లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద(Flood) ముంపు నివారణ చర్యల్లో భాగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, దాదాపు రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరదనీటి కాలువ బాక్సు కల్వర్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి లింగంపల్లి అండర్ బ్రిడ్జి (Under Bridge) ప్రాంతంలో వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు వివరించారు.
ప్రజాపాలనలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి..
ప్రజాపాలన(Praja Palana) కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అధికారులకు ఆదేశించారు. శుక్రంవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డికాలనీ మల్టీపర్పస్ ఫంక్షన్హాలులో ఏర్పాటుచేసిన ప్రజాపాలన కేంద్రాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి పరిశీలించారు.
అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Welfare Schemes) అందేలా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించి లబ్దిచేకూర్చేలా చూడాలని సూచించారు.శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు మారబోయిన రాజుయాదవ్, శ్రీకళ, పద్మరావు, బసవయ్య, జమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

