కంటెంట్‌పై దృష్టి పెట్టాలి
‘నిర్మాతలు అంటే దర్శకులకు భయం భక్తి ఉండాలి. పరిమిత బడ్జెట్లో సినిమాలు తీయాలి. భారీ బడ్జెట్‌తో తీస్తేనే పెద్ద సినిమాలు కావు. మంచి కంటెంట్‌పై దృష్టి పెడితేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. వరుణ్‌తేజ్ మొదటి నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా ప్రతి సినిమాతో తనని తాను నిరూపించుకుంటున్నాడు’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
‘నిర్మాతలు అంటే దర్శకులకు భయం భక్తి ఉండాలి. పరిమిత బడ్జెట్లో సినిమాలు తీయాలి. భారీ బడ్జెట్‌తో తీస్తేనే పెద్ద సినిమాలు కావు. మంచి కంటెంట్‌పై దృష్టి పెడితేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. వరుణ్‌తేజ్ మొదటి నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా ప్రతి సినిమాతో తనని తాను నిరూపించుకుంటున్నాడు’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మంగళవారం ‘కొరియన్ కనకరాజు’ మెగాబ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఇలాంటి విజయాలను మనమంతా సెలబ్రేట్ చేసుకోవాలి. దర్శకుడు మేర్లపాక గాంధీ జనాలకు నచ్చే అద్భుతమైన కంటెంట్‌ను అందించాడు. హారర్ కామెడీ సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఈ సినిమాలో కొరియన్ ప్లేవర్‌ను, కల్చర్‌ను తీసుకురావడం అద్భుతమైన ఆలోచన. అదే సినిమా విజయానికి ప్రధాన కారణం. ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి వరుస విజయాలు రావడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఈ సినిమాలు నిరూపించాయి’ అన్నారు. ఈ సినిమా ద్వారా మెగాఫ్యాన్స్కు మంచి విజయాన్ని అందించానని గర్వంగా ఉందని వరుణ్‌తేజ్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

