బంజారాహిల్స్,జూన్ 28: దళితులను సామాజికంగా, అర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్‌తో వారి జీవితాలు మారనున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఫిలింనగర్‌లోని శంకర్ విలాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. దళితులకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందన్నారు.ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం అభినందనీయమన్నారు. టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దయ్యాల దాసు, నాయకులు లక్ష్మీనారాయణ, వెంకటేశ్, రంగన్న, రమణ, అబ్దుల్ ఘనీ తదితరులు పాల్గొన్నారు.