రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదు
రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు మద్దతు ధర్నాను శామీర్పేట మండల కేంద్రం లో నిర్వహించి ఆందోళన చేపట్టారు.
- ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
- శామీర్పేటలో రైతు మద్దతు ధర్నా
శామీర్పేట: రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు మద్దతు ధర్నాను శామీర్పేట మండల కేంద్రం లో నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాయమాట లు, మోసపూరిత మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుందని ఎద్దేవా చేశారు. రైతును మోసం చేసిన ఏ ప్రభుత్వమైనా పుట్టగతుల్లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి 420 హామీలను నెరవేర్చే వర కు రైతులకు, మహిళలకు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీలేదని వి మర్శించారు.
నిరంతర విద్యుత్ సరఫరాలోను, ఫర్టిలైజర్స్, సాగునీటిని అం దించడంలోనే కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దీనికి తోడు అకాల వర్షాలు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయని సకాలంలో ధాన్యం కొనుగో లు చేస్తే రైతులకు నష్టాలు వచ్చే పరిస్థితులే ఉండేవి కావన్నారు. ప్రభు త్వం ఇస్తానన్న విధంగా దొడ్డు బియ్యం రైతులకు రూ.500లు వెంటనే బోనస్ గా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల విషయానికి వస్తే కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.
మహిళల కు రూ.2500లు, రూ.4 వేల ఫించన్, రైతు భరోసా ఊసేలేదన్నారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తానని ఓట్లు తింటున్న కాంగ్రెస్ పాలకులు ఈ ఆరు గ్యారెంటీల విషయంలో స్పష్టమైన తేదీ ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిపాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతోనే కాలం వెల్లదీస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభు త్వం హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాలకు సంక్షేమాలు అందిస్తూనే రాష్ర్టాన్ని అభివృద్ధి పథకం లో తీసుకెళ్లారని గుర్తు చేశారు.
రైతాంగానికి నాణ్యమైన నిరంతర విద్యుత్, సాగునీరు, ధాన్యం కొనుగోలు కేంద్రా లు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం జరిగిందన్నారు. కొనుగో లు చేసిన ధాన్యానికి రోజుల వ్యవధిలో నే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చే యడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం లో కరెంటు లేదు, సాగునీళ్లు లేవు, ధా న్యం కొనుగోలు లేవు మొత్తం 420 పరిపాలన నడుస్తుందన్నారు. రైతులకు, మ హిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వ రకు బీఆర్ఎస్ ఊర్కోదని, ప్రజల పక్షా న పోరాడుతుందన్నారు. డీసీఎంఎస్ వీసీ మధుకర్రెడ్డి, తూంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, డైరెక్టర్లు, రై తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

