ఉప్పల్, జూలై 4 : తెలంగాణ బోనాల జాతరను ఘనంగా నిర్వహించడానికి నిధులు మంజూరు చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాకతీయనగర్ శ్రీమహంకాళి, శ్రీరామ మందిరం చైర్మన్ గాయం శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిశారు. ఈమేరకు బోనాల జాతరకు నిధులు మంజూరు చేసేలా చూడాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అదేవిధంగా ఓయూ నుంచి ఆలయ ప్రాంతంలోకి వచ్చే నీటి వరద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు వేముల సంతోష్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, వీరేశ్, సుధాకర్, వేముల వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్, మనోహర్, సూరం శంకర్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కలిశారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి బోనాల జాతరకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్లోని దేవాలయాలకు ప్రత్యేక నిధులు వచ్చేవిధంగా, బోనాల సందర్భంగా ఆలయాల వద్ద సమస్యలు లేకుండా చూడాలని కోరారు. ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.