రామంతాపూర్, సెప్టెంబర్ 5 : దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. రామంతాపూర్ చిన్న చెరువులోని శ్రీ పాండురంగస్వామి దేవాలయంలో స్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం స్వామి కి ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూప్రతి సంవత్సరం శ్రీపాండు రంగస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
అనంతరం ఎమ్మెల్యేను దేవాలయ నిర్వాహకులు సన్మానించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ బీవీ చారిని పరామర్శించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుభాష్‌పాటిల్, బంకతారావు, ఏక్నాథ్బీరాధర్, నీలాత్కాంత్బీరాధర్, పాండురంగబీరాధర్, కృష్ణాపాటిల్, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్ ఉన్నారు.
ఉప్పల్ క్యాంపు కార్యాలయంలో భగత్‌నగర్‌కు చెందిన ఆదిలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ 2 లక్షల చెక్కు ఎల్వోసీని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆదివారం ఆమె కు అందజేశారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.
మల్లాపూర్, సెప్టెంబర్ 5 ః మల్లాపూర్ డివిజన్ మర్రిగూడలో ఓ ఇంటిలో ఇటీవల షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లోని సామగ్రి కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి కార్పొరేటర్దేవేందర్రెడ్డితో కలిసి ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉండి సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యుత్, రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి, గూడూరు శైలేష్‌రెడ్డి, జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, వాసుదేవ్‌గౌడ్, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ఎలక్ట్రికల్ ఏఈ క్రిష్ణయ్య, వీఆర్ఏ నరేందర్ పాల్గొన్నారు.
మల్లాపూర్, సెప్టెంబర్ 5 : సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్‌కు చెందిన గౌసియాబేగంకు 60 వేలు, రాజుగౌడ్‌కు 25 వేలు రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం మల్లాపూర్ వార్డు కార్యాయలంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసుదేవ్‌గౌడ్, గూడూరు శైలేష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రవణ్, రాపోలు శ్రీనివాస్, సుధాకర్, జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.