ఉప్పల్, జూలై 21 : ప్రజల్లో హరితస్ఫూర్తిని కలిగిస్తూ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రెస్‌క్లబ్ కార్యాలయ ఆవరణలో బుధవారం హరితహారంలో భాగంగా ఏసీపీ రంగస్వామి, సీఐ గోవింద్‌రెడ్డి, అడ్మిన్ ఎస్ఐ జయరాంతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో, బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని, వాటి సంరక్షణ కోసం కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలన్నారు. భవిష్యత్ తరాల కోసం మనవంతు తోడ్పాటును అందించాలన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు దొంతుల వెంకట్రామిరెడ్డి, కె.నరోత్తంరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు సురేశ్, సాగర్, శ్రీధర్‌రావు, కోశాధికారి యాదగిరి, సంయుక్త కార్యదర్శి శివాజీ, ముఖ్య సలహదారులు సురేశ్, మహేందర్‌రెడ్డి, కిశోర్ పాల్గొన్నారు.
వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడ డివిజన్లోని రవీంద్రనగర్, లక్ష్మీనగర్, సాయిచిత్రనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వరదనీరు, మురుగునీటి సమస్యలను పరిశీలించారు. రవీంద్రనగర్‌లో మురుగునీటి లైన్లను శుభ్రం చేయించడంతోపాటు, రోడ్లపై మట్టి, మురుగును తొలగింపచేశారు. యూజీడీలలో పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని, మురుగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రామంతాపూర్ పెద్దచెరువును సందర్శించి, వరదనీటి తొలగింపు పనులు, ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నీటితొలగింపు మోటార్లను పరిశీలించి, కాలనీ వాసుల ఇండ్లలోకి నీరు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డీఈ చందన, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, అజిత్‌రెడ్డి, సోమిరెడ్డి, వెంకటేశ్, జయచంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, చారి, కృష్ణారెడ్డి, సుధాకర్, సూరం శంకర్ పాల్గొన్నారు.