ఉప్పల్ జోన్ బృందం, జూలై 2: ఉప్పల్ నియోజకవర్గంలో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి బస్తీలో నిర్వహించారు. ఆయా బస్తీల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. చాలా ప్రాంతాల్లో మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, పన్నాల దేవేందర్‌రెడ్డి, స్వర్ణరాజ్, ప్రభుదాస్, బన్నాల గీతాప్రవీణ్ , మందుముళ్ల రజితాపరమేశ్వర్‌రెడ్డి, చేతన హరీశ్, బండారు శ్రీవాణి, సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్‌రెడ్డి, అధికారులు డీసీ శంకర్, ఈఈ కోటేశ్వర్రావు, డీఈ రూప, డాక్టర్ మైత్రేయి, జలమండలి డీజీఎం. కృష్ణ, ఏఈ ప్రత్యూష, వేణు, ఎంటమాలజీ అధికారి రమేశ్, డీఈ బాలకృష్ణ, ఏఈ సత్యలక్ష్మి, డీసీ అరుణ కుమారి, ఈఈ నాగేందర్, డీఈ చందన, ఏఈ వసంత, సత్యనారాయణ, సుదర్శన్, డీఈ నిఖిల్రెడ్డితోపాటు నాయకులు కొత్తరామారావు, జి. శ్రీనివాస్‌రెడ్డి, నాగిళ్ల బాల్‌రెడ్డి, విద్యాసాగర్, బాబు గంగపుత్ర, రాఘవరెడ్డి, అనిల్, శ్రీకాంత్‌యాదవ్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి, జూలై 2 : దళిత పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. వారి సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. పెద్ద చర్లపల్లిలో టీఆర్ఎస్ నాయకులు డప్పు గిరిబాబు, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా, హెచ్‌బీకాలనీలోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే బేతి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్‌రెడ్డి, కొత్తరామారావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.