మియాపూర్, అక్టోబర్ 17: నియోజకవర్గంలోని అన్ని కాలనీలను మౌలిక వసతుల పరంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.నియోజకవర్గం పరిధి లోని కూకట్పల్లి డివిజన్ పాపారాయుడునగర్ అసోసియేషన్‌ను నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు ఆదివారం విప్ గాంధీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో రహదారులు ,తాగునీరు, విద్యుత్, డ్రైనేజీలు, వరద కాలువలు, కమ్యూనిటీ హాళ్లు వంటి పూర్తి స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. కాలనీ సం ఘాలు సైతం కాలనీ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని, ప్రజలను భాగస్వాములు చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించాలని విప్ గాంధీ పేర్కొన్నారు. కాలనీలవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వెంకట్రావ్, ఉపాధ్యక్షులు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, అక్టోబర్ 17: గుల్మెహార్ పార్కు కాలనీలో నిబంధనకు విరుద్ధ్దంగా జరుగుతున్న అపార్టుమెంట్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కాలనీ సంక్షేమ సంఘం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఆదివారం వినతిపత్రం సమర్పించారు. కాలనీ ఏర్పడి 27 సంవత్సరాలు అవుతుందని, పూర్తిగా ఇండిపెండెంట్ ఇండ్ల నిర్మాణం కోసం లేఅవుట్ చేయడం జరిగిందని సంక్షేమ సంఘం నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కాలనీలో అపార్టుమెంట్ల నిర్మా ణం నిషేధించడం జరిగిందని, కాలనీ అసోసియేషన్ బైలాస్‌లో కుడా ఈ విషయం పొందుపరిచామని తెలిపారు.కానీ ఇటీవల కొందరు బిల్డర్లు అపార్టుమెంట్ల నిర్మాణానికి పాల్పడుతున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు కాలనీ సంక్షేమ సంఘం నాయకు లు కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.కాలనీ సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఖాసీం, ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.