జియాగూడ, సెప్టెంబర్ 30: తాగిన మైకంలో ఈత కోసం మూసీలోకి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ శంకర్ కథ నం ప్రకారం.. కర్నూలుకు చెందిన శ్రీనివాస్ (30) జియాగూడ కేశవస్వామినగర్ సమీపంలోని మూసీ పరీవాహక ప్రాంతంలో గుడిసెలో ఉంటున్నాడు. జీహెచ్ఎంసీ వ్యర్థాల వాహనం నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. బుధవారం మద్యం తాగిన శ్రీనివాస్ పక్కనే మూసీనదిలో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు.