సిటీబ్యూరో, మే 17 ( నమస్తే తెలంగాణ ) : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ క్రీడా పోటీలు జరిగాయి. మార్షల్ ఆర్ట్, యోగా, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో ప్రతిభ చాటారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్పోర్ట్స్ మీట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
109 దేశాల అందాల భామలు ఇందులో పాల్గొన్నారు. కాగా, ఆదివారం సుందరీమణులు తెలంగాణ సచివాలయం, పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం ట్యాంక్‌బండ్ సండే ఫండే కార్నివాల్లో పాల్గొని సందడి చేయనున్నారు.