హైదరాబాద్ : టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎర్రోళ్ల శ్రీనివాస్ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. అలాగే జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.