Minister Talasani | మే నాటికి మన బస్తీ మన బడి అభివృద్ధి పనులు పూర్తి : మంత్రి తలసాని
Minister Talasani | మే నాటికి మన బస్తీ - మన బడి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్లో మన బస్తీ - మన బడి పనులపై శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
Minister Talasani | మే నాటికి మన బస్తీ – మన బడి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్లో మన బస్తీ – మన బడి పనులపై శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి.. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందజేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.
మన బస్తీ – మన బడి పథకం అమలు కోసం రూ.7289 కోట్లు మంజూరు చేశారని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ పథకం మొదటి విడతలో భాగంగా హైదరాబాద్లోని 239 పాఠశాల్లోల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పాఠశాలల అభివృద్ధికి ఇంత మొత్తంలో నిధులు కేటాయించలేదని అన్నారు. అలాగే బిల్లులు చెల్లించలేదనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, నగర మేయర్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

