బడంగ్‌పేట, మార్చి 16: టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ స్వర్గీయ తీగల కృపాకర్‌రెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తీగల నితీశ్‌రెడ్డి, తీగల దినేశ్‌రెడ్డి, కార్పొరేటర్లు, తదితరులు ఉన్నారు.