మేడ్చల్ రూరల్ / పీర్జాదిగూడ / బోడుప్పల్ / ఘట్కేసర్ / ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 23: బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు కానుకగా చీరలను అందజేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పీర్జాదిగూడ, ఘట్కేసర్, బోడుప్పల్, ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడలో శుక్రవారం నిర్వహించిన చీరల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పండుగ పూట ఆడబిడ్డల కళ్లల్లో సంతోషాన్ని చూడాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ చీరలను అందజేస్తున్నారని పేర్కొన్నారు. చీరల పంపిణీ ద్వారా నేతన్నకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మహిళలు, రైతులు, వృద్ధులు, దివ్యాంగులు, కుల వృత్తుల సంక్షేమానికి పాటుపడుతూనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు. ఆకలి చావులకు గురవుతున్న నేతన్నలను ఉమ్మడి పాలనలో పట్టించుకోలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంతో పాటు పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో…
పీర్జాదిగూడ పరిధిలో ఎం కన్వెన్షన్ హాల్లో మేయర్ జక్క వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు హరిశంకర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, శారద ఈశ్వర్‌రెడ్డి, యుగేందర్ రెడ్డి, రమ్య సతీశ్‌గౌడ్, సుభాష్‌నాయక్, ప్రసన్నలక్ష్మి శ్రీధర్‌రెడ్డి, మంజుల రవీందర్, రాజేశ్వరి అంజిరెడ్డి, స్వాతిగౌడ్, శశిరేఖ, సుమలత, మహేశ్, శాలిని, సరిత, నాయకులు పాల్గొన్నారు.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో…
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మక్ బాలయ్య ఫంక్షన్ హాలులో మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కమిషనర్ పద్మజారాణి, కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో…
ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో చైర్మన్లు ఎం.పావనీ జంగయ్య యాదవ్, బి.కొండల్‌రెడ్డిల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కమిషనర్లు సురేశ్, వసంత, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.సురేందర్ రెడ్డి, బి.శ్రీనివాస్ గౌడ్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
చౌదరిగూడలో…
చౌదరిగూడ వెంకటాద్రి టౌన్‌షిప్‌లోని సర్పంచ్ అతిథి గృహం ఆవరణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఎంపీడీవో అరుణ, సర్పంచులు రమాదేవి రాములు గౌడ్, వెంకట్ రెడ్డి, గీత శ్రీనివాస్, ఎంపీటీసీలు సరళ కుమార్, వినోద, భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.