మేడ్చల్, జనవరి 14 : మేడ్చల్ మున్సిపాలిటీకి క్లీనెస్ట్ సిటీ అవార్డు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 25 వేల నుంచి 50వేల జనాభా ఉన్న పట్టణాల్లో మేడ్చల్ మున్సిపాలిటీకి క్లీనెస్ట్ సిటీ అవార్డు వచ్చింది. దక్షిణ భారతదేశ స్థాయిలో కేంద్ర బృందం జరిపిన పరిశీలనలో పారిశుధ్య నిర్వహణలో ఉత్తమంగా వ్యవహరించిన కారణంగా మేడ్చల్‌కు రెండో స్థానం లభించింది. ఈ అవార్డులను రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అందజేయనున్నారు. మున్సిపాలిటీ అవార్డు రావడంపై చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహరెడ్డి, కమిషనర్ టీఎస్‌వీఎన్ త్రిల్లేశ్వర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.