మచ్చబొల్లారం బస్తీ దవాఖానను బుధవారం మేడ్చల్ కలెక్టర్ మనుచౌదరి ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మసీ స్టోర్ల రిజిస్టర్లను పరిశీలించారు. బస్తీ దవాఖాన ఇరుకు గదిలో ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అల్వాల్ మెడికల్ డాక్టర్ శ్రీకాంత్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ వెంట అల్వాల్ తహసీల్దార్ రాములు, ఆర్ఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
-అల్వాల్ ఏప్రిల్ 29