హైదరాబాద్, ఏప్రిల్ 29 : ప్రముఖ ఆహార పదార్థాల సంస్థ ఎంటీఆర్ ఫుడ్స్..తెలంగాణ మార్కెట్లోకి మినిట్ ఫ్రెష్ బ్యాటర్ శ్రేణి ఉత్పత్తులను విడుదల చేసింది. దోశ పిండి, రవ్వ ఇడ్లీ పిండి రూపంలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో తెలంగాణలో రెడీ టూ ఈట్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలోపెట్టుకొని వీటిని విడుదల చేసినట్టు కంపెనీ సీఈవో సునయ్ భాసిన్ తెలిపారు.
ఈ ఉత్పత్తులు క్విక్ కామర్స్, ఈ-కామర్స్ సైట్లలో మాత్రమే లభించనున్నాయని, భవిష్యత్తులో రిటైల్ మార్కెట్లోకి తీసుకొచ్చే ఉద్దేశంలో సంస్థ ఉన్నట్టు చెప్పారు.