ఉప్పల్, ఆగస్టు 3 : అంటువ్యాధుల నివారణకు చర్యలు చేపట్టామని మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం హబ్సిగూడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, పరాన్నజీవుల ఇన్ఫెక్షన్ రేటును తగ్గించడం, పేగు పురుగుల నిర్మూలన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డాక్టర్ నారాయణరావు, డాక్టర్ సరస్వతి, డాక్టర్ రఘునాథ్స్వామి, డాక్టర్ కౌశిక్, డాక్టర్ జీవనజ్యోతి, ఉపాధ్యాయులు రవీంద్రారెడ్డి, శ్రీనివాస్, సిగ్మతుల్ల, కరుణాదేవి, బోగ ప్రకాశ్, గొంగడయ్య, వెంకట్రావు, సువర్ణ, శ్యామల పాల్గొన్నారు.
రామంతాపూర్, ఆగస్టు 3 : హబ్సిగూడ డివిజన్ పరిధిలోని వెంకట్‌రెడ్డినగర్ పట్టణ ఆరోగ్యకేంద్రంలో గురువారం జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్‌లు విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులను వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంజులవాణి, ప్రధానోపాధ్యాయులు సత్తిరెడ్డి, నాయకులు వేములకొండ వెంకన్న గౌడ్, చెల్లోజు ఎల్లాచారి, శివగౌడ్, కృష్ణ, మల్లయ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆగస్టు 3 :జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మల్లాపూర్ జిల్లాపరిషత్ హైస్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి హాజరై విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.