బండ్లగూడ, నవంబర్ 3: బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని మేయర్ మహేందర్‌గౌడ్ తెలిపారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు శ్రీలతాసురేశ్గౌడ్, పద్మావతి పాపయ్య యాదవ్, పలువురు మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ప్రస్తుతం మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలను కూడా ప్రజలకు తెలుపుతున్నామన్నారు. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చంద్రశేఖర్, శ్రీనాథ్‌రెడ్డి, అస్లాంబిన్ అబ్దుల్లా, సాగర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాందాస్, సురేశ్‌గౌడ్, మల్లేశ్ యాదవ్, పాపయ్య యాదవ్, గోపాల్ ముదిరాజ్, రజాక్ రాజు, షామిలేటు రాజు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి.. సంక్షేమాన్ని గెలిపించాలి
మైలార్‌దేవ్‌పల్లి, నవంబర్ 3: కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ను గెలిపించాలని బీఆర్ఎస్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు టి.ప్రేమ్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని గణేశ్‌నగర్, ఉడ్డెంగడ్డ, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సీఎం కేసిఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాము గౌడ్, రాము యాదవ్, రాఘవేందర్ యాదవ్, జైపాల్, వెంకటేశ్, గట్టయ్య, జీవన్‌గౌడ్, బుచ్చయ్య గుప్తా, సంతోష్‌రెడ్డి, ఎల్లప్ప, డీవీ కుమర్, బండారి యాదగిరి, విజయ్‌కుమార్, వజ్రమ్మ, పుష్పమ్మ, స్వప్నగౌడ్, అర్జున్, రాజు, జి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మణికొండ మున్సిపాలిటీలో ప్రచార యాత్ర..
మణికొండ, నవంబర్ 3: బీఆర్ఎస్ చేపడుతున్న ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్కే తమ పూర్తి మద్దతు తెలుపుతున్నారని బీఆర్ఎస్ పార్టీ మణికొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు వెల్లడించారు. మూడోరోజు మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. శుక్రవారం మణికొండ ఆర్కే సర్కిల్ నుంచి ప్రారంభమై కాలినడకన ప్రచార యాత్రలో భాగంగా కేపీఆర్ కాలనీ, మణికొండ గార్డెన్స్, సెక్రటేరియట్ కాలనీ తదితర ప్రాంతాల్లో గడపగడపకూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. ప్రచారానికి ఎక్కడికి వెళ్లిన ప్రజలు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నారని.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాలే ఆయనను నాలుగోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ కాలనీ సమాక్య అధ్యక్షుడు సీతారాందూళిపాల, బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్‌కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజల పూర్తి మద్దతు బీఆర్ఎస్కే..
అత్తాపూర్, నవంబర్ 3: ప్రజల పూర్తి మద్దతు బీఆర్ఎస్కే ఉందని స్పష్టమవుతుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, చిన్న, సురేశ్‌రెడ్డి, అమరేందర్ వెల్లడించారు. అత్తాపూర్ డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారంలో భాగంగా శుక్రవారం అపార్ట్మెంట్ వాసులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. అత్తాపూర్, హైదర్‌గూడ, పాండురంగానగర్ తదితర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో ఉంటున్న అసోసియేషన్ సభ్యులతో సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసోసియేషన్ సభ్యులకు వివరించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తమతమ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ను భారీ మెజార్టీగో గెలిపించాలని కోరారు. అపార్ట్మెంట్ల అసోసియేషన్ సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్కు ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు.