అంబర్‌పేట : ఆషాడ మాస బోనాల సందర్భంగా అంబర్‌పేట దేవస్థాన సేవా సమితి నిర్వహించే బోనాల ఉత్సవాలకు రావాలని మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఆహ్వానించారు. దేవాదదాయ శాఖ నుంచి నూతన పట్టు వస్త్రాలు తీసుకురానున్న మేయర్‌కు ఉత్సవ ఆహ్వాన పత్రికను సమితి ప్రతినిధులు బుధవారం అందించారు.
మాజీ కార్పొరేటర్ కే పద్మావతి, దేవస్థాన సేవాసమితి ప్రతినిథులు రంగంపల్లి రాజు, గడ్డం శశిథర్ గౌడ్, గడ్డం సునీల్ గౌడ్, పుట్ట సందీప్ గౌడ్, రుద్రగోని రోహన్ గౌడ్, బింది సాయిరాం గౌడ్ తదితరులు మేయర్‌ను ఆహ్వానించిన వారిలో ఉన్నారు.