కార్మికలోకం వర్ధిల్లాలి
కార్మిక దినోత్సవాన్ని ఆదివారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మిక దినోత్సవాన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు
ఘనంగా కార్మిక దినోత్సవం
ఊరూరా సంబురాలు
జెండాలు ఆవిష్కరించి స్వీట్లు పంచుకున్న కార్మికులు
మేడ్చల్ జోన్ బృందం, మే 1 : కార్మిక దినోత్సవాన్ని ఆదివారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మిక దినోత్సవాన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాలను ఆవిష్కరించి, కార్మికలోకం వర్ధిల్లాలి అంటూ నినదించారు. స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు.
- గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో జరిగిన జెండావిష్కరణలో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
- మేడ్చల్ పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, జెండావిష్కరణ నిర్వహించారు.
- ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అపెరల్ పార్కులో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కావేరి శేఖర్ జెండాను ఆవిష్కరించారు.
- కండ్లకోయలో వైస్ చైర్మన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్మికులను సన్మానించారు.
- ఘట్కేసర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎం.పావని జంగయ్య యాదవ్ పారిశుధ్య, కార్యాలయ సిబ్బందితో మేడే ఉత్సవాలను నిర్వహించారు.
- పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో చైర్మన్ కొండల్‌రెడ్డి, మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులతో కలిసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు.
- ఘట్కేసర్ మండల పరిధిలోని అవుషాపూర్‌లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ కావేరి, కొర్రెములలో మండల
- సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్లు ఎర్ర జెండాలను ఎగురవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
- బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో మేయర్ సామల బుచ్చిరెడ్డి జెండాను ఆవిష్కరించి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ రాసాల వెంకటేశ్‌యాదవ్, యాదగిరి, రాములు, శ్రీధర్ పాల్గొన్నారు.
- బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇందిరానగర్ చౌరస్తాలో బోడుప్పల్ సీపీఐ కార్యదర్శి రచ్చ కిషన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి బాల మల్లేశ్, లక్ష్మీ, బాల్‌రాజ్, సహదేవ్, మార్టిన్, రమేశ్, ఐలయ్య, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- జవహర్‌నగర్ కార్పొరేషన్లో కార్మిక దినోత్సవ వేడుకల్లో ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చిన్నం బాలనర్సింహ. బాలునాయక్, భిక్షపతి, కల్యాణ్ పాల్గొన్నారు.
- శామీర్‌పేటలో టీఆర్ఎస్ నాయకులు అఫ్జల్ఖాన్, మైనార్జీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌గౌస్, నర్సింహారెడ్డి, నిస్సార్, వెంకట్‌రెడ్డిలు శామీర్‌పేట గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు పాదరక్షలు పంపిణీ చేశారు.
చాయతీ పారిశుధ్య కార్మికులకు పాదరక్షలు పంపిణీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- celebrations
- dignity
- Labour
- May day
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

