మాస్టర్ విరాట్ చంద్ర ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Minister Srinivas goud | అతిపిన్న వయస్సు కలిగిన పర్వతారోహకుడు మాస్టర్ విరాట్ చంద్రను క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు.

హైదరాబాద్ : అతిపిన్న వయస్సు కలిగిన పర్వతారోహకుడు మాస్టర్ విరాట్ చంద్రను క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు.
ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని ఎత్తయిన పర్వతం ఖిలిమంజరో (5895 Mtrs) (19,340 Feets) ను అతిపిన్న వయస్సు కలిగిన పర్వతారోహకుడు మాస్టర్ విరాట్ చంద్ర (8 ) అధిరోహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సాధించాడు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మాస్టర్ విరాట్ చంద్ర భవిష్యత్ లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. త్వరలో క్రీడా పాలసీని ప్రవేశ పెడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రీడల హబ్‌గా తీర్చిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డా. అబ్రహం, మాస్టర్ విరాట్ చంద్ర తల్లిదండ్రులు శరత్ చంద్ర, మాధవి, కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్, వేద కుమారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

