బంజారాహిల్స్/అల్లాపూర్, అక్టోబర్ 27: మైనార్టీల సంక్షేమానికి పాటుపడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారంతా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. హెచ్వైసీ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నేత సల్మాన్‌ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం బోరబండ డివిజన్‌కు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
వీరికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మైనార్టీలను కేవలం ఓటుబ్యాంకుగా చూసిన కాంగ్రెస్ పార్టీ వారి అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, షాదీముబారక్, విదేశీ విద్యకోసం స్కాలర్షిప్స్ తదితర పథకాలు అందించామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ పథకాలన్నింటినీ రద్దుచేశారన్నారు. మైనార్టీల కోసం నిరంతరం కృషి చేస్తున్న సల్మాన్‌ఖాన్ చేరికతో వందలాదిమంది యువకులు బీఆర్ఎస్లోకి వస్తున్నారని, వారికి పార్టీలో సరైన ప్రాధాన్యత ఉంటుందన్నారు.