వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 19 : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం శాంతి సామరస్యాలకు నిలయంగా మారిందని,కాంగ్రెస్ కు ఓటేస్తే అంధకారం అవుతుందని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం, చింతల్మెట్ డివిజన్ దామోదర్ రెడ్డి ఫంక్షన్ హాల్సమావేశం ఆవరణలో ఏర్పాటు చేసిన ముస్లింల ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరయ్యారు. హజ్ కమిటీ చైర్మన్ సలీమ్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మత కల్లోలాలు ఉండేవన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గ నాయకులు ముఖీబ్, ముర్తుజా, నయ్యూమోద్దీన్, ముఖ్రమ్ఖాన్, ఎండీ గౌస్ , జహీర్బాయ్, వషీమ్భాయ్, మథీన్, గౌషియా, ననామేడం, సైనాజ్ పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, నవంబర్ 19 : బీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు వార్డు సభ్యుడు కోడూరిశేఖర్,ప్రభాకర్,సంపత్,మధు,లింగం,అనిల్‌గౌడ్,శేఖర్‌గౌడ్, మహేందర్, సత్తయ్య,మహ్మద్, ఖా జా,సాదక్,సాయికుమార్‌లతో పాటు 100 మంది నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మణికొండ, నవంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన పదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మాజీ ఎంపీపీ, మణికొండ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త తలారి మల్లేశ్‌ముదిరాజ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 100 మంది మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మల్లేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్య క్రమంలో మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, మైనార్టీ విభాగం అధ్యక్షుడు బషీర్, మహిళా విభాగం అధ్యక్షురాలలు రూపారెడ్డి, నాయకులు చందు, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
మణికొండ, నవంబర్ 19: మణికొండ మున్సిపాలిటీ 16వ వార్డులో ఆదివారం ఇంటింటికీ ప్రచారాన్ని కౌన్సిలర్ శైలజ ఆధ్వర్యంలో విస్తృతంగా చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్గౌడ్కి ప్రజలంతా మద్దతు పలకాలని కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలకాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ మహిళా విభాగం నాయకురాలు విజయలక్ష్మి, సరోజిని తదితరులు పాల్గొన్నారు.
బండ్లగూడ, నవంబర్ 19 : గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామ పరిధిలోని పలువురు విల్లా వాసులు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రంప్ విల్లా, ఇస్తా అపార్ట్మెంట్, రాజా క్షేత్ర అపార్ట్మెంట్, ఆర్వీ నిర్మాణ్ విల్లాస్ వారితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్పొరేటర్ సాగర్ గౌడ్, నిఖిల సంగారెడ్డి, కోఆప్షన్ సభ్యులు జగదీశ్, బీజేఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ రాందాస్ ముదిరాజ్, యువజన విభాగం అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ జయ మల్లేశ్ యాదవ్, శ్రీసదానంద్ రాజు నాయక్, చేగూరి రాజు, సీనియర్ నాయకులు వినోద్‌యాదవ్, రాజుగౌడ్, మల్లేశ్ యాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, హరీశ్‌రెడ్డి, జయరాజు పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి, నవంబర్ 19: యువత ఉజ్వల భవిష్యత్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి ఉపాధి అవకాశాలు, విదేశీ ఉన్నత విద్య అభ్యసించేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్ అన్నారు. మధుబన్‌కాలనీకి చెందిన పలువురు యువకులు ఆదివారం ప్రేమ్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన యువకులు రవి, రఘు, చిన్న, ప్రవీణ్, సత్తి, రాజు, గంగా వంశీ, సతీశ్, బాలసాయి, రామకృష్ణ, నవీన్‌కుమార్, రాజు, ప్రభాకర్, గణేశ్, మహేశ్, తరుణ్, వరద రాజు, సురేశ్, రాంప్రసాద్, సురేశ్, రాజేశ్, సతీశ్, నాని, సాయి, నరేశ్ తదితరులకు పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.