బంజారాహిల్స్, అక్టోబర్ 21: రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో వారంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. నియోజకవర్గం క్రిస్టియన్ యూత్ అధ్యక్షుడు కందుల దిలీప్‌తో పాటు పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో ఆయన నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సర్వమతాలను సమానంగా చూసే సంస్కృతి వచ్చిందన్నారు. ముస్లింలు, క్రైస్తవుల కష్టాలు గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు వారికోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన దిలీప్‌తోపాటు నాయకులు బి.పీటర్, ఆంథోనీ దాస్, శంకర్. డానీ తదితరులు పాల్గొన్నారు.