Manholes | మ్యాన్‌హోల్ తీస్తే జరిమానాతో పాటు జైలు.. జలమండలి ఎండీ హెచ్చరిక
Manholes | గ్రేటర్‌లోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. వర్షాకాల నేపథ్యంలో జలమండలికి సమాచారం లేకుండా ఎవ్వరూ మ్యాన్‌హోల్ తెరవొద్దని సూచించారు.
- జలమండలికి సమాచారం లేకుండా మూతలు తెరవొద్దు
- పౌరులకు ఎండీ సుదర్శన్ రెడ్డి హెచ్చరిక
సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌లోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. వర్షాకాల నేపథ్యంలో జలమండలికి సమాచారం లేకుండా ఎవ్వరూ మ్యాన్‌హోల్ తెరవొద్దని సూచించారు. ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు, అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోళ్లపై ఉన్న మూత తెరిచినా, తొలగించినా.. జలమండలి యాక్ట్-1989 సెక్షన్ 74 ప్రకారం నేరమన్నారు. దీనిని అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులతో పాటు నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముందని ఎండీ చెప్పారు. వర్షాకాల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుందని వెల్లడించారు. లోతైన మ్యాన్‌హోల్స్‌తో పాటు 25 వేలకు పైగా మ్యాన్‌హోళ్లపై ఇప్పటికే సేఫ్టీగ్రిల్స్ బిగించామని, ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి రెడ్ పెయింట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు (ఈఆర్టీ), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దించామని, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందజేశామని ఎండీ తెలిపారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీ వాటర్ మోటారు ఉంటుందని, దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తారని చెప్పారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేస్తారని, అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయన్నారు. వీటితో పాటు ఎయిర్‌టెక్ మిషిన్లు సైతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. మ్యాన్‌హోల్స్ నుంచి తీసిన వ్యర్థాలు (సిల్ట్)ని ఎప్పటికప్పుడు తొలగిస్తారని ఎండీ పేర్కొన్నారు.
సెక్షన్‌కు ఒక బృందం ఏర్పాటు..
మ్యాన్‌హోల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందం ఏర్పాటు చేశారు. వీరు ఉదయాన్నే క్షేత్రస్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. చౌకేజీ, వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా , ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
కార్మికులకు శిక్షణ ..
పారిశుధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై వారికి జలమండలి ఏటా భద్రతా వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భద్రతా పరికరాల పనితీరు, ఉపయోగించే విధానం, పారిశుధ్య పనుల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై శిక్షణ ఇస్తోంది. అంతేకాకుండా పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తుంది. వర్షాకాలంలో మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

