హైదరాబాద్ : నగరంలోని హాస్టల్స్, హోటల్స్‌లో తదితర వాటిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నప్పటికి ఎలాంటి మార్పు కనిపించడంలేదు. నగరంలో రోజు ఎక్కడో ఓ చోట అపరిశుభ్రత, ఆహార కల్తీ జరుగుతూనే ఉంది.
తాజాగా శ్రీ రాఘవేంద్ర హోటల్లో(Sri Raghavendra Hotel )ఓ కస్టమర్ తినే దోసలో(Dosa) మాడిపోయిన బొద్దింక(Dead cockroach) దర్శనమివ్వడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు ఫిల్లర్ నెంబర్ 106 వద్ద గల శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోస ఆర్డర్ చేశాడు. దోస తింటుండగా అందులో మాడిపోయిన బొద్దింక వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన కస్టమర్ హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. కాగా, అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు.
శ్రీ రాఘవేంద్ర హోటల్ దోసలో మాడిపోయిన బొద్దింక
హైదరాబాద్ – పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ 106 వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసలో వచ్చిన మాడిపోయిన బొద్దింక
ఆందోళనకు గురైన కస్టమర్లు pic.twitter.com/igomQAEtFj
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2024