బంజారాహిల్స్, జూలై 6: తన భార్య వేరే వ్యక్తితో గదిలో ఉండటాన్ని తట్టుకోలేక భర్త..ఆమెపై బీర్‌బాటిల్‌తో దాడి చేశాడు. అనంతపురం జిల్లా పామిడి గ్రామానికి చెందిన బోయ ప్రకాశ్ 2013లో అదే గ్రామానికి చెందిన యువతి(24)ని ప్రేమ వివాహం చేసుకొని.. బెంగళూరులో కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు రావడంతో పిల్లలతో కలిసి భార్య హైదరాబాద్‌కు వచ్చేసి కృష్ణానగర్‌లో ఉంటూ.. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది.
మంగళవారం అర్ధరాత్రి ఆమె పనిచేసే సినిమా షూటింగ్ ఆఫీస్‌కు వెళ్లిన ప్రకాశ్‌కు.. ఓ గదిలో తన భార్యతో పాటు మరో యువకుడు కనిపించాడు. ఆగ్రహించిన ప్రకాశ్ బీర్‌బాటిల్‌తో భార్యపై దాడి చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇంటికి వచ్చే క్రమంలో వర్షం రావడంతో వేరే యువకుడితో పాటు వచ్చి ఆఫీసులో ఉన్నానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.