నా జోలికి వస్తే అంతు చూస్తా..
రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మాణం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించిన జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బందిపై కత్తితో దాడికి యత్నించిన ఘటనలో ఓ వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీ ప్రధాన రహదారిపై ప్లాట్ నెంబర్ 224(ఏ)లో నూకారపు రామకృష్ణ అనే వ్యక్తికి సుమారు 200 గజాల స్థలం ఉంది.
- టౌన్‌ప్లానింగ్ అధికారులపై కత్తిదూసిన వ్యక్తి
- రోడ్డు అక్రమించవద్దని చెప్పడంతో వీరంగం
బంజారాహిల్స్, జూలై 25 : రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మాణం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించిన జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బందిపై కత్తితో దాడికి యత్నించిన ఘటనలో ఓ వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీ ప్రధాన రహదారిపై ప్లాట్ నెంబర్ 224(ఏ)లో నూకారపు రామకృష్ణ అనే వ్యక్తికి సుమారు 200 గజాల స్థలం ఉంది. వారంరోజులుగా ఈ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణపనులు చేస్తున్న రామకృష్ణ తన ప్లాట్‌కు కుడివైపున ఉన్న రోడ్ నెం 6లోకి సుమారు 5అడుగుల మేర ఆక్రమించారు.
దీంతో ఎమ్మెల్యే కాలనీ అధ్యక్షుడు నారాయణరెడ్డితో పాటు సభ్యులు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేశారు. కాగా వారి ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు శుక్రవారం జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్‌ప్లానింగ్ విభాగం సెక్షన్ అధికారి సాయికిరణ్, చంద్రయ్య, శివసాయి అక్కడకు వచ్చారు. రోడ్డుమీదకు వచ్చి ప్రహరీ ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు. సొసైటీ లే అవుట్లో 40ఫీట్ల రోడ్డు ఉండాలని, ఇప్పటికే సుమారు 10 అడుగులు కుంచించుకుపోయందని, ముందుకు రావద్దని సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనయిన రామకృష్ణ వీరంగం సృష్టించాడు. తన జోలికి వస్తే అంతుచూస్తానని, తనకు ప్రభుత్వంలో పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు.
పత్రాలు చూపిస్తే సరిపోయే దానికి ఎందుకు బూతులు తిడుతున్నారంటూ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ప్రశ్నించగా రెచ్చిపోయిన రామకృష్ణ పరుగెత్తుకుంటూ వెళ్లి తన కారులోంచి తల్వార్‌ను తీసుకువచ్చి నరికేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమ సిబ్బంది విధులను అడ్డుకోవడమే కాకుండా కత్తి తీసుకువచ్చి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడంటూ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు నూకారపు రామకృష్ణ మీద బీఎన్ఎస్ 132, 351(2),పీడీపీపీ యాక్ట్‌తో పాటు ఆర్మ్స్ యాక్ట్స్ కింద కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

