Mamidi Harikrishna | ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 3: సమ స్త చరిత్ర పరిశోధకులకు తెలంగాణ రాష్ట్రం ఖజానా లాంటిదని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ యాన్షియెంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఆర్కియాలజీ కన్వర్జెన్స్ ఇన్టు మల్టీ ఇంటర్ ట్రాన్స్ డిసిప్లినరీ అప్రోచెస్’ అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మామిడి హరికృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కియాలజీ అంటే మానవ సమాజ నిర్మాణ మూ లాల్లోకి వెళ్లడమని చెప్పారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆర్కియాలజీ పరిశోధనల ద్వారా విజ్ఞానాన్ని భవిష్యత్తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. హరప్పా నాగరికత నుంచి మొదలుకొ ని నేటి ఆధునిక నాగరికత పరిణామ క్రమంలో నేడు డిజిటల్ యుగంలోకి చేరుకున్నామని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు విజ్ఞాన వ్యాప్తిలో పరిశోధనలు ఎంతో ఉపయోగకరం గా ఉంటున్నాయన్నారు.
ఓయూ మాజీ రిజిస్ట్రార్, ఆర్కియాలజీ విభాగం మాజీ హెడ్ ప్రొ. కిషన్ రావు మాట్లాడుతూ, చరిత్ర రచనలకు ఆర్కియాలజీ పరిశోధనలు కీలకమని అన్నారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థి మేడి దివ్య రాసిన ‘మెగాలిథిక్ బరియల్స్ ఇన్ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించా రు. కార్యక్రమంలో సదస్సు డైరెక్టర్ ప్రొ.లావ ణ్య, కన్వీనర్ డా.యాలాల శివానంద్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.తలత్ సుల్తానా, వైస్ ప్రిన్సిపాల్ డా.బీనవేణి రామ్ షెఫర్డ్, ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొ.రాములు, జర్నలిజం విభాగం హెడ్ డా. టి.సతీశ్ కుమా ర్, ఆడిట్ సెల్ జేడీ డా. రమేశ్, డా. రామలిం గం, పరంధాములు, సోమేశ్వర్ పాల్గొన్నారు.