సిటీబ్యూరో: హరహర శంభో శంకర అంటూ.. ఆ శివుడిని మనసారా కొలిచేందుకు భక్తులు సిద్ధమయ్యారు. బుధవారం శివరాత్రిని పురస్కరించుకొని నగరవ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి.
మరోవైపు కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ జాతరలకు సిటీ నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. కీసరగుట్టకు 285 , ఏడుపాయలకు 125, బీరంగూడకు 30 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. మరింత సమాచారం కోసం 9959226160, 9959226154 నంబర్లను సంప్రదించాలని సూచించింది.